BSA Gold Star 650BSA Gold Star 650

ఈ నేల 15న భారత్ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ లాంచింగ్..

ఇవీ డీటెయిల్స్..!

BSA Gold Star 650 | ఐకానిక్ బ్రిటిష్ బ్రాండ్ బీఎస్ఏ మోటార్ సైకిల్స్ తన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ను ఈ నెల 15న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గోల్డ్ స్టార్తోపాటు క్లాసిక్ లెజెండ్స్ .. ఈ మోటార్ సైకిల్ ను ఆవిస్కరిస్తోంది. 2021 నుంచి బ్రిటన్,యూరోపియన్ యూనియన్ దేశాలు సహా 23 దేశాల మార్కెట్లలో ఈ మోటారు సైకిల్ ను రీలాంచ్ చేస్తూ వస్తోంది. 1861లో స్థాపించిన బర్మింగ్ హమ్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ (బీఎస్ఏ) తొలుత ఫైర్ ఆర్మ్స్ తయారు చేసేది. 1903 నుంచి మోటారు సైకిల్ పరిశ్రమలోకి ఎంటరైంది. 1910లో తొలి మోటారు సైకిల్ ను ఆవిష్కరించింది.

మహీంద్రా అండ్ మహీంద్రా భాగస్వామ్యంతో భారత్ లో ఉత్పత్తవుతున్న బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిళ్లు.. రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టర్ మోటారు సైకిళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. బీఎస్ఏ

గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ 652సీసీ, లిక్విడ్
కూల్డ్, సింగిల్ సిలిండర్ మోటారుతో వస్తోంది. ఈ ఇంజిన్ 45 బీహెచ్పీ విద్యుత్, 55 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ట్విన్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ పానెల్
తోపాటు రౌండ్ హెడ్ ల్యాంప్ కలిగి ఉంటుంది.

ఓల్డ్ స్కూల్ డిజైన్ హౌసెస్ తోపాటు ట్యాంకుపైరౌండ్ బీఎస్ఏ లోగో ఉంటుంది. ఈ ఫ్యుయల్ ట్యాంకు 12 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం కలిగి ఉంటుంది. రెట్రో టెయిల్ ల్యాంప్, ఫెండర్ కాంబో ఉంటాయి. ఆగస్టు 15న బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ ధర వెల్లడిస్తారని తెలుస్తోంది. భారత్ స్వాతంత్ర్యానికి ముందు పార్శీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు బహుమతులుగా ఇచ్చేందుకు బీఎస్ఏ మోటారు సైకిళ్లను దిగుమతి చేసే వారు. అలా ఈ మోటారు సైకిళ్లు ప్రైజ్డ్ కలెక్టబుల్స్ గా మారడంతో దేశవ్యాప్తంగా వింటేజ్ వాహనాల కలెక్టర్లు.. వీటిని సేకరించేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *