ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2 లో స్మార్ట్ ల్యాబ్ ప్రారంభం
ఫోర్టెస్ వారి ఆర్థిక సహకారంతో, ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2, ఆదిలాబాద్ లో స్మార్ట్ ల్యాబ్‌ను డా. రమేష్, దిగంబర్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల కోసం 5 కంప్యూటర్లు, 5 టేబుల్స్, 10 కుర్చీలు అందజేశారు.
డా. రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ తత్వం మరియు నైపుణ్యాలు పెంచడంలో ఫోర్టెస్ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. స్మార్ట్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునే అవకాశాలు లభిస్తాయని, అదిలాబాద్ జిల్లా లోని మరెన్నో పాఠశాలల్లో ఇలాంటి ల్యాబ్ లను రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ ట్రస్టీ దిగంబర్, పద్మిని, ప్రాజెక్ట్ మేనేజర్ ప్రశాంత్, ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి, శైలెందర్, భూపతి, సుచరిత, సాంధ్య రాణి, సతీష్, హరీష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.