వచ్చే ఏడాది మార్చి కల్లా ఎట్టి పరిస్థితిలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జెన్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. Batti Vikramarka సచివాలయంలో జెన్ కో ఉన్నతాధికారులతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి యూనిట్ అక్టోబర్ 30.. ఐదో యూనిట్ను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్లాంట్లో పనిచేసే కొద్దిమంది అధికారులు, సిబ్బంది జ్వరాలతో బాధపడుతున్నారని.. ఫలితంగా పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నట్లు సమావేశంలో అధికారులు వివరించారు. సిబ్బంది సంక్షేమమే ప్రధానమని.. వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని.. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.