శరీరం డీ హైడ్రేషన్ కాకుండా తరచూ మంచి నీళ్లు తాగడం చాలా అవసరం. దాంతో కిడ్నీలు సహా శరీరంలోని సున్నితమైన అవయవాలన్నీ తాజాగా ఉంటాయి. కానీ ఆరోగ్యానికి మంచిది కదా అని అదేపనిగా మంచి నీళ్లు తాగితే అసలుకే మోసం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డీ హైడ్రేషన్ (Dehydration) మాత్రమే కాదు, ఓవర్ హైడ్రేషన్ (Over- Hydration) కూడా ఆరోగ్యానికి హానికరమేనని వారు చెబుతున్నారు. మరి ఓవర్ హైడ్రేషన్ వల్ల కలిగే ఆ దుష్ప్రభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓవర్ హైడ్రేషన్ దుష్ప్రభావాలు

చాలా మందికి డీహైడ్రేషన్ గురించి తెలుసుగానీ ఓవర్ హైడ్రేషన్ గురించి అంత అవగాహన ఉండదు. పరిమితికి మించి నీరు తాగితే ఈ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా అథ్లెట్లలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఓవర్ హైడ్రేషన్ అరుదైన సమస్యే కానీ అథ్లెట్లు తమ సామర్థ్యం తమ సామర్థ్యం పెంచుకునేందుకు నీళ్లు ఎక్కువగా తాగుతారు. శరీరంలో నీరు తగినంత ఉంటే మరింత మెరుగ్గా క్రీడల్లో పాల్గొనవచ్చనేది వారి నమ్మకం.

ఈ క్రమంలో శరీరంలో నీరు ఎక్కువై ఎలక్ట్రోలైట్ల (లవణాలు) స్థాయిల్లో మార్పులు వస్తాయి. ముందుగా సోడియం స్థాయి తగ్గిపోతుంది. దీంతో ఆలోచనల్లో స్పష్టత లోపించినట్టు ఉండటం, వాంతులు, కండరాల బలహీనత, పట్టేసినట్టు ఉండటం, తలనొప్పి వంటివి తలెత్తుత్తాయి. అత్యంత అరుదైన సందర్భాల్లో.. మెంటల్ కన్ఫ్యూజన్, ఫిట్స్తోపాటు కోమాలోకి కూడా వెళ్లొచ్చు.
* ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే నీరు తాగే విషయంలోనూ నియంత్రణ పాటించాలని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా గంటకు ఒక లీటరుకు మించి నీటిని తాగకూడదని అంటున్నారు. ఈ పరిమితికి లోబడి ఉంటే శరీరంలోని అదనపు నీటిని తొలగించడానికి కిడ్నీలకు తగినంత సమయం దొరుకుతుంది. దాంతో శరీరంలోని ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఆరోగ్యకర స్థాయిలో కొనసాగుతుంది. అతిగా తాగినా ఆరోగ్యానికి ప్రమాదమే

* ఇదిలావుంటే ఓవర్ హైడ్రేషన్తో ఇన్ఫ్లమేషన్ తలెత్తిన సందర్భాల్లో పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఉన్నాయి. పసుపు, అల్లం, ఆకు కూరలు, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, టమాటాలు, విత్తనాలు, గింజలు, గ్రీన్ టీతో ఈ ఇన్ఫ్లమేషన్ను తగ్గించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *