డిల్లీ : అదిలాబాద్ జిల్లా కేంద్రంగా విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎం.పి నగేష్ గారు కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మర్యదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
అదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో 1592 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించి ఉందందని తెలిపారు. దీని ఏర్పాటు వలన అదిలాబాద్ ప్రజల కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని మరియు అదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని మంత్రి గారికి విన్నవించారు. మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు MP నగేష్ గారు తెలిపినారు. జిల్లా అభివృద్దే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.