ఆదిలాబాద్ జిల్లా :
ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండ చరియలు గ్రామాలపై విరిగి పడగా వారిని రక్షించి,సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో చేపట్టిన సహాయక చర్యలో పాల్గొని అనేక మందిని కాపాడి తిరిగి సొంత గ్రామానికి వచ్చిన గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మోహితే సురేష్ ని ఈరోజు సామజిక సేవకులు రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటి వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు గ్రామ యువకులతో కలిసి సురేష్ ని అభినoదించి శాలువతో సన్మానించారు. ఈ సందర్బంగా సత్యరాజ్ మాట్లడుతూ వయనాడ్ ఘోర ఘటనలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండ ప్రజలను రక్షిస్తూ, సురక్షిత ప్రాంతాలకు తరలించడంకోసం చురామల లో నదిపై తాత్కాలిక వంతెనను నిర్మించడంలో ఆర్మీ జవాన్ సురేష్ కీలకంగా వ్యవహరించడం అభినందనీయమని తమ గ్రామ ఆర్మీ జవాన్ గా గర్వించదగ్గ విషయమని సత్యరాజ్ అన్నారు.కార్యక్రమంలో గ్రామస్తులు హబీబ్ ఖాన్, ఓం కుమార్, రాహుల్, సుదాం,అశోక్,మిలింద్, గోవర్ధన్, పప్పు తదితరులు ఉన్నారు.