K.C.R: ఈ రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీ ఏమిటో చెప్పాలి . కాంగ్రెస్ బడ్జెట్‌పై కేసీఆర్ కౌంటర్..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై మాజీ సీ.ఎం కేసీఆర్ తీవ్రవిమర్శలు చేశారు. ఉప ముఖ్యమంత్ర్రి భట్టి పద్దు బడ్జెట్లాగా లేదు.. రాజకీయ ప్రసంగంలాగ ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉన్నాడని అన్నారు . భట్టి విక్రమార్క బడ్జెట్ ను నొక్కి నొక్కి చెప్పడం తప్ప వాస్తవం ఏమి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తమకు పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నదని అన్నారు. ఏ ఒక్కటి కొత్త సంక్షేమ పథకం లేదని విమర్శించారు మరియు ప్రతి ఒక్క అంశాన్ని కూలంకశంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ బడ్జెట్ గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే లాగా ఉన్నదని కౌంటర్ ఇచ్చారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు.. విధానం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామని తెలిపినారు . ఈ ప్రభుత్వం అన్ని రకాల వర్గాలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ బడ్జెట్లో దళితబంధు ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. మత్స్య కారులకు భరోసా కల్పించలేదని తెలిపారు. ఏ ఒక్కటి కొత్త సంక్షేమ పథకము ప్రకటించలేదని తెలిపారు . ఈ బడ్జెట్ లో సగభాగమైన మహిళలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు
తాము కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని ఆరునెలలు ఆగినట్లు తెలిపారు. అందులో భాగంగానే అసెంబ్లీకి కూడా తాను రాలేదన్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకంపై పాలసీ చేసినట్లు ఎక్కడా కనిపించలేదన్నారు. తమకు వ్యవసాయంపై స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. వ్యవసాయం రంగంపై కూడా బడ్జెట్ నిరుత్సాహ పరిచే విధంగా ఉందన్నారు. తమ పరిపాలనలో రెండుసార్లు రైతుబంధు ఇచ్చామన్నారు. . రైతుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టిన డబ్బులను తామేదో దుర్వినియోగం చేశామని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కానీ ఈ బడ్జెట్లో రైతుల కోసం ఏ విధమైన విధానాలు ప్రకటించలేదన్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని తెలుస్తోందన్నారు. ఎనిమిది నెలలు పూర్తీ అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్, నీరు సరఫరా చేయలేదని విమర్శించారు. వృత్తికార్మికులను, రైతులను ఈ ప్రభుత్వం వంచించిందన్నారు. ఇండస్ట్రియల్, ఐటీ, వ్యవసాయ, అభివృద్ది పాలసీ ఏంటని నిలదీశారు . బడ్జెట్‌కు ఓ పద్ధతి పద్దు లేదన్నారు. ఇది పేదల రైతుల బడ్జెట్ కాదని చెప్పారు.