Dist Collector Rajarshi ShaDist Collector Rajarshi Sha

15th August స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని
– జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టర్

Dist Collector Rajarshi Sha
Dist Collector Rajarshi Sha
  • 15th ఆగష్టు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని Dist Collector Rajarshi Sha  అధికారులను ఆదేశించారు . గురువారం
    కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన 15th ఆగష్టు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పై సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించనున్నందున వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, తదితర శాఖల శకటాల ప్రదర్శనతో పాటు స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గృహ జ్యోతి, మహాలక్ష్మి , రూ. 500 లకు గ్యాస్ కనెక్షన్, రైతు రుణ మాఫీ, రైతు భరోసా, వన మహోత్సవం తదితర పథకాల పై శకటాలు, స్టాల్స్ ఉండాలన్నారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు.
  • విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక అధికారులు ఉదయం తమతమ మండలాలు, గ్రామాలలో జెండా ఆవిష్కరణ జరిపి, జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని, ప్రత్యేక అధికారులు అందుబాటులో లేని పక్షంలో మండల కేంద్రాలలో ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు జెండావిష్కరణ చేయవచ్చని సూచించారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించిన వారికి ఉత్తమ ఉద్యోగుల ఎంపిక కోసం శాఖల వారీగా నిర్ణీత గడువులోపు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవీయ ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *