ప్రభుత్వానికి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధి లేదు
నాలుగు నెలల నుంచి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి
- గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్త శుద్ది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ ఆరోపించారు. సీఐటీయూ అనుబంధ సంగం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో కలెక్టర్ ఎదుట గురువారం ఒక్కరోజు సమ్మె చేపట్టారు.
- విధులు బహిష్కరించి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయమైన ప్రభుత్వాలకు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు.
- జీపీ కార్మికుల సమస్యల పరిష్కరానికి గతంలో నిర్వహించిన ఆందోలనలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 8 నెలలు అవుతున్న నేటికి పరిష్కరించడం లేదన్నారు.
- నాలుగైదు నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉండడంతో కుటుంబ పోషణ కార్మికులకు భారంగా మరిందన్నారు. వేతనాలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో CITU అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా శ్రీను, ఉపాధ్యక్షుడు రాజు, సోనేరావ్, వెంకర్రావు, విలాస్, అడెల్లు, గంగన్న, అశోక్, దశరత్, శ్రీను, రాంషావ్, బాజీరావ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.