హైవేలు ఉన్నది ట్రాక్టర్ల పార్కింగ్ కోసం కాదు..
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ..!
శంభు సరిహద్దును పాక్షికంగా తెరవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దులను తెరవాలని ఆదేశించింది. ఈ విషయంలో పంజాబ్, హర్మానా డీజీపీలు వారంలోగా సమావేశం నిర్వహించి.. సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పింది. వాస్తవానికి గత కొంతకాలంగా ఎంఎస్పీ చట్టం డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిఫిబ్రవరిలో రైతులు ఢిల్లీకి వెళ్లేందుకు యత్నించగా.. హర్యానా ప్రభుత్వం రైతులను శంభు సరిహద్దులో బారికేడ్లు ఏర్పాటు చేసి అందుకున్నది. అప్పటి నుంచి రైతులు అక్కడే బైఠాయించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
శంభు సరిహద్దులో ఒక లైన్ సాధారణ ప్రయాణికుల కోసం తెరవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. పాటియాలా, అంబాల జిల్లాల ఎస్పీలతో వారంలోగా సమావేశం కావాలని హర్యానా, పంజాబ్ డీజీపీలను కోర్టు ఆదేశించింది. ట్రాక్టర్లను రోడ్డుపై నుంచి తొలగించేందుకు రైతులను ఒప్పించాలని హర్యానా సర్కారుకు సూచించింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు రాజకీయేతర వ్యక్తులతో కమిటీని ఏర్పాటు చేసి రైతులతో సమావేశాలను నిర్వహించడంపై సుప్రీంకోర్టు అభినందించింది. హైవేలు ఉన్నది ట్రాక్టర్ల పార్కింగ్ కోసం కాదని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
అంబులెన్స్‌లు, అవసరమైన సేవలు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, బాలిక విద్యార్థులు, సమీప ప్రాంతాల స్థానిక ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి శంభు వద్ద రహదారిని పాక్షికంగా తెరవడం అవసరమని పేర్కొన్నది.
రైతులు పండించిన పంటలకు మద్దతు ధరకు సంబంధించి చట్టాన్ని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 13 నుంచి రైతులు నిరసన తెలుపుతున్నారు. శంభు సరిహద్దుల్లోని బారికేడ్లను వారంలోగా తొలగించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఫిబ్రవరిలో అంబాలా-న్యూఢిల్లీ జాతీయ రహదారిపై సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్). కిసాన్ మజ్జూర్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీకి కవాతు నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.