జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన రిమ్స్ ప్యానెల్ న్యాయవాది
ఇటీవల రిమ్స్ ప్యానల్ అడ్వకేట్గా జొండలే అజయ్ కుమార్ నియమితులైయ్యారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. ప్రభాకర్ రావును ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కశారు. ఈమేరకు పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. రిమ్స్ ప్యానెల్ అడ్వకేట్గా శక్తి సామర్ధ్యాల మేరకు బాధితులు, న్యాయ సలహాలు అందిస్తానన్నారు. నిరుపేదలకు నాణ్యమైన సేవలను అందించడానికి కృషి చేస్తానని అడ్వకేట్ అజయ్ న్యాయమూర్తికి వివరించారు. కలిసిన వారిలో న్యాయవాదులు భగత్ మహేందర్, రాగం ప్రశాంత్, తదితరులు ఉన్నారు.