దేశ ప్రజలకు లబ్ధి చేకూర్చే బడ్జెట్ ఇది
-కాంగ్రెస్ పార్టీ నాయకులు బడ్జెట్ పై విమర్శలు చేయడం సరికాదు
-రాష్ట్రానికి 51 వేల కోట్ల రూపాయలు సంవత్సరంలో రానున్నాయి.. స్వయంగా రాష్ట్ర మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రస్తావించారు
– బీజీపీ ఎంపి జి.నగేశ్ MP Nagesh
గత నెల 23న కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దేశ ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉందని ఆదిలాబాద్ ఎంపీ జి. నగేష్ అన్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు కేంద్ర బడ్జెట్ పై ఆరోపణలు విమర్శలు చేయడంపై ఖండించారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ నగేష్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ .. కేంద్ర బడ్జెట్లో 9 అంశాలను ప్రాముఖ్యతగా తీసుకొని యువకులను నైపుణ్యాలను వెలికి తీసి, శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నామన్నారు. చాలా దూర దృష్టితో ₹ 48 లక్షల వేల కోట్లు బడ్జెట్ పాస్ కావడం జరిగింది అన్నారు. బడ్జెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేకమైన మాటలు విమర్శలు చేశారన్నారు. బడ్జెట్ ఏ విధంగా ప్రిపేర్ చేశారని రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని ఆరోపణ చేశారు. మేధావులు, చదువుకున్న వాళ్ళు తెలుసు.. కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు కేటాయిస్తుందో వాళ్లు అర్థం చేసుకున్నారు.
రాష్ట్రానికి 51 వేల కోట్లు కేంద్రం నుండి బడ్జెట్ ఇవ్వనున్నారు అన్నారు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆర్థిక పద్దుల్లో చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. కేంద్రానికి వచ్చే పన్నులు రూపంలో 26 వేల 242 కోట్లు ,21 వేల కోట్లు, రుణాల రూపంలో 3009 కోట్ల రూపాయలు కేంద్రం నుండి నిధులు రాష్ట్రానికి వస్తున్నాయని స్వయంగా రాష్ట్ర మంత్రి ప్రకటించారని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు జోగురవి, ఆకుల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు