బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొనసాగుతున్న పచ్చదనం పరిశుభ్రత లో కార్యకర్తల సేవా కార్యక్రమాలు.
జైనథ్ మండల బి ఆర్ఎస్ పార్టీ నాయకుడు సతీష్ పార్టీపై ఉన్న అభిమానాన్ని. వినూత్న రీతితో చాటుకుంటున్నాడు.
కైలాస్ నగర్ లోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పచ్చదనం పరిశుభ్రత లో భాగంగా చేపడుతున్న పిచ్చి మొక్కల తొలగింపులో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాలుపంచుకుంటున్నారు.
పార్టీ కార్యాలయానికి రోజు వచ్చే కార్యకర్తలకు విష కీటకాల నుండి ఎలాంటి హాని తలెత్తకుండా గడ్డి మందు తో పాటు దోమల మందును స్వయంగా తానే పార్టీ కార్యాలయం చుట్టూ పిచికారి చేసి బిఆర్ఎస్ పార్టీతో పాటు మాజీ మంత్రి జోగు రామన్న పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటున్నాడు.
పార్టీ కార్యాలయానికి వచ్చే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు దోమలు విషకేటకాల నుండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సేవా కార్యక్రమాన్ని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బట్టు సతీష్ చేస్తున్నటువంటి ఈ సేవ కార్యక్రమాని పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జోగు రామన్న నాయకత్వాన్ని బలపరిచేందుకు మరింత కృషి చేస్తామని బట్టు సతీష్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.