రుణమాఫీపై అయోమయాన్ని సృష్టిస్తున్నారు
రాష్ట్రంలో రుణమాఫీ సంబంధిత సమస్యలపై అయ్యోమయాన్ని సృష్టిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. నిజంగా రుణమాఫీ జరుగుతున్నట్లయితే, రైతులు రోడ్లపైకి ఎందుకు వచ్చారు అన్న విషయాన్ని ప్రశ్నించారు.
రుణమాఫీపై త్వరలోనే స్పష్టమైన కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
రేవంత్ ఏబీవీపీ నుంచి వచ్చారని, అందువల్ల బీజేపీలోకి చేరడం సాధ్యమే అని కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన విమర్శించారు. కేసీఆర్ కాంగ్రెస్ నుండి వచ్చారని, అయితే ఆయన కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లిపోతారా అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్తో విలీనమవ్వాల్సిన అవసరం మాకు లేదు అని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో సొంతబలంకోసం కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.