Actor Nithin | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రయ్యారు!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Actor Nithiin) తన జీవితంలో కొత్త దశను ప్రారంభించారు. ఆయన సతీమణి శాలిని కందుకూరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకర వార్తను నితిన్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, “మా ఫ్యామిలీలోకి వచ్చిన సరికొత్త స్టార్కి స్వాగతం” అంటూ అందమైన ఫోటోను కూడా షేర్ చేశారు.
నితిన్ అభిమానులు ఈ శుభవార్త తెలుసుకొని, ఆయనకు మరియు కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా నితిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నితిన్ తన కెరీర్‌లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ, వ్యక్తిగత జీవితంలో కూడా మంచి విషయంలో ఆనందం పొందుతున్నారు. తండ్రిగా మారినందుకు ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
సినిమాల విషయానికి వస్తే…
ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న “రాబిన్ హుడ్” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.