రిమ్స్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ – డెంగ్యూ కేసులపై జిల్లా కలెక్టర్ ఆరా
Adilabad collector – రిమ్స్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ – డెంగ్యూ కేసులపై జిల్లా కలెక్టర్ ఆరా
జిల్లా కలెక్టర్ రాజర్షి షా రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు రెండు గంటల పాటు బ్లడ్ బ్యాంక్, పిల్లల వార్డు, ఫిమేల్ మెడికల్ వార్డు, ఆర్ ఓ ప్లాంట్, ఐసోలేషన్ వార్డు, పిడియాట్రిక్ ఐసియు, జనరల్ వార్డు, బ్లడ్ టెస్ట్ గది వంటి విభాగాలను సందర్శించారు. డెంగ్యూ కేసులపై ఆరా తీశారు మరియు పేషంట్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తుందని, ఆసుపత్రిలో డెంగ్యూ కిట్లు, ఆర్ డి ఎస్ తగినంత ఉన్నాయా, రోజుకు ఎన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు అని ఫార్మసీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ఐసియు వార్డు, ఫార్మసీ, హాజరు రిజిస్టర్, మందుల నిల్వలను కూడా పరిశీలించారు.
సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని Adilabad collector సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అబిగ్యాన్ మాలవియ, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, వైద్యాధికారులు, స్టాఫ్ నర్స్ తదితరులు పాల్గొన్నారు.