ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలం గూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 8 ఏళ్ల కొడప రాజు అనే బాలుడు బుధవారం సాయంత్రం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా, ఒక్కసారిగా పాము కాటేసింది.
పాముకాటు విషయం తెలుసుకున్న స్థానికులు తక్షణమే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, బాలున్ని ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.
పాముకాటు చికిత్స అందించేందుకు హాస్పిటల్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు, అయితే బాలుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ హృదయవిదారక సంఘటన స్థానికులను కలచివేసింది.