ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు

కేసు విచారణ ఆగస్టు 8న జరుగనున్నది. తిహార్ జైలు నుంచి కేజ్రివాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

– తిహార్ జైలు నుంచి కేజీవాల్ సీబీఐ అరెస్టు చేసింది.


మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రివాల్ పై సీబీఐ చార్జిషీట్ దాఖలు …

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 25న పొడిగించిన విషయం తెలిసిందే. కేసు విచారణ ఆగస్టు 8న జరుగనున్నది. తిహార్ జైలు నుంచి కేజ్రివాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తిహార్ జైలులోనే కేజీవాల్ను సీబీఐ అరెస్టు చేసింది.

సీఎం కేజ్రివాల్తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు నేతలకు జూలై 31 వరకు రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 31 వరకు కస్టడీని పొడిగించింది. ఇంతకు ముందు జూలై 12న సీబీఐ విచారిస్తున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేసులకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రివాల్ను ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరుచగా.. కస్టడీని ఈ నెలాఖరు వరకు పొడిగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *