కుంచెట్టి సంతోష్కుంచెట్టి సంతోష్

ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు మనుకోవాలి

బీజేపీ మండల అధ్యక్షుడు కుంచెట్టి సంతోష్

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు ఇంకితజ్ఞానం లేదని బీజేపీ మండల అధ్యక్షుడు కుంచెట్టి సంతోష్ అన్నారు. సోమవారం ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేణుక సిమెంట్ ఫ్యాక్టరి విషయంలో రైతులకు ఇచ్చి పరిహారంము విషయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులను భయపెట్టి ఒప్పించాలని చూస్తున్నారని ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారన్నారు. వాస్తవానికి ధర నిర్ణయించేది ప్రభుత్వం, అధికారులు అంతేకాని ఈ ధర విషయంలో ఎమ్మెల్యే పాత్ర ఏమాత్రం ఉండదని ఇంకిత జ్ఞానం కూడాలేదన్నారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రైతులకు అధిక ధర ఇప్పిచడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఎమ్మెల్యే పై ఆరోపనుల చేస్తే ఖబర్దార్ని హెచ్చరించారు. వెంటనే ఎమ్మెల్యేకు క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఫక్షంలో రైతులతో కలిసి ప్రజాభవన్ను ముట్టడిస్తామన్నారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బందిపెలి దయాకర్, మాజీ ప్రజాప్రతినిధులు కొడపలింగు, కె. మహేందర్, కార్తిక్, స్వామి, లాడేసునిల్, దత్తు, మామిల్ల గంగరెడ్డి, కత్తిచిన్నయ్య, బుచ్చన్న తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *