బేల : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని వెంటనే అమలు చేసి, అర్హులైన రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్ డిమాండ్ చేశారు.
ఆదివారం బేల మండల కేంద్రంలో బిజెపి నాయకులు రైతులతో కలిసి అంతరాష్ట్ర రోడ్డుపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా, వేణు గోపాల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. రుణమాఫీని తక్షణమే అమలు చేయకపోతే, రైతుల సమక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నిక్కం దత్త, మండల కిసాన్ మోర్చా సెల్ అధ్యక్షులు ఖోడే ప్రదీప్, మండల జనరల్ సెక్రటరీ శివకుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ ఠాక్రె, మరియు నాయకులు ఇంద్రశేఖర్, తేజీరావు, రాకేష్, మోరేశ్వర్, నవీన్, మహేష్, గణేష్, కృష్ణ వంటి పలువురు రైతులు పాల్గొన్నారు.