ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభం
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో బాక్సింగ్ రింగులో శనివారం సాయంత్రం ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జిల్లా ఒలింపిక సంఘం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ ఆటలో రాణిస్తున్న వారికి ఎంతో ధైర్యం ఉంటుందన్నారు. ఆదిలాబాద్ సరిహద్దున నిజామాబాద్ జిల్లా నుంచి నిఖిత్ ఝరీన్, మహమ్మద్ హుస్సాముద్దీన్ బాక్సింగ్ ఆటలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వారిని ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాక్సింగ్ సమాఖ్య బాధ్యులు బాల్ బహదూర్ సింగ్, కృష్ణ, శ్రీనివాస్, ఎల్లయ్య, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల బాక్సింగ్ సంఘం కార్యదర్శులు శంషుద్దీన్, రవీందర్ గౌడ్, విజయకుమార్, ఎం. ఎం. బేగ్ అదిలాబాద్ జిల్లా బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు విజేందర్ తదితరులు పాల్గొన్నారు