కేంద్ర సర్కారుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అప్పులు తక్కువే

లోక్సభలో కేంద్రప్రభుత్వం వెల్లడి

కేంద్రం అప్పులు 185 లక్షల కోట్లు..

తెలంగాణ అప్పులు నియంత్రణలోనే..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ రుణాలతో కలిపి కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.185 లక్షల కోట్లకు చేరవచ్చని నరేంద్రమోదీ సర్కారు అంచనా వేసింది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 56.8 శాతానికి సమానమని తెలిపింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పు రూ.171.78 లక్షల కోట్లుగా ఉన్నదని, ఇది జీడీపీలో 58.2 శాతానికి సమానమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్ సభలో వెల్లడించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వరల్డ్ ఔట్లుక్ అంచనాల ప్రకారం ఈ ఏడాది మార్చి చివరి నాటికి స్థిర ధరల వద్ద దేశ జిడిపి 3.57 లక్షల డాలర్లకు ( ₹ 2,98,91,859 కోట్లకు) చేరినట్టు తెలిపారు. స్థిర ధరల వద్ద ప్రైవేట్ తుది వినిమయ వ్యయం (పీఎఫ్సీఈ) వృద్ధి రేటు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగా, గత ఆర్థిక సంవత్సరంలో 4 శాతంగా ఉన్నది.

తెలంగాణ అప్పులు నియంత్రణలోనే..

బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేస్తుండటం గమనార్హం.

కేంద్రాన్ని పల్లెత్తు మాట అనని రేవంత్ సర్కారు..

కేంద్రం నుంచి సాయం అందకపోయినా.. కొత్త రాష్ట్రమైనప్పటికీ రుణాలను పరిమితంగానే తీసుకొన్నది తెలంగాణ. జీఎస్టీపీతో పోలిస్తే అతి తక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉండటమే దీనికి నిదర్శనం. పెద్ద రాష్ట్రాల సూచీలో జీఎస్టీపీలో అప్పుల పరంగా తెలంగాణ కిందినుంచి ఐదో స్థానంలో ఉండగా, జీఎస్టీపీలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలుగా పశ్చిమబెంగాల్, రాజస్థాన్, బీహార్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ జీఎస్టీపీ రూ.14.64 లక్షల కోట్లు ఉండగా, ఇందులో అప్పుల వాటా 23.8 శాతం. ఇక, ఎస్ఆర్బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదు. కానీ, కేంద్రం అప్పులు జీడీపీలో 56 శాతానికి పైగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. కేంద్రంతో పోల్చి చూసినా.. తెలంగాణ చేసిన అప్పుడు నియంత్రణలోనే ఉన్నాయని స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ జీఎస్టీపీ రూ.14.64 లక్షల కోట్లు ఉండగా, ఇందులో అప్పుల వాటా 23.8 శాతం. ఇక, ఎఫ్ఎల్బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదు. కానీ, కేంద్రం అప్పులు జీడీపీలో 56 శాతానికి పైగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. కేంద్రంతో పోల్చి చూసినా.. తెలంగాణ చేసిన అప్పుడు నియంత్రణలోనే ఉన్నాయని దీన్నిబట్టి అర్థమవుతున్నది. అయినప్పటికీ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనని రేవంత్ సర్కారు.. అప్పులు పరిమితంగానే చేసినప్పటికీ గత బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేస్తుండటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *