భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు అప్లై చేయడానికి పెట్టిన వేలిముద్ర విధానాన్ని తీసేయాలనీ సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు.బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాన్ని హైదారాబాద్ లోని CITU సెంటర్ సిటీ కార్యాలయం లో నిర్వహించారు.ఈ సమావేశానికి హాజరై జిల్లా రిపోర్టు ప్రవేశపెడుతూ…సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ.. భావన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు హెల్పర్ బోర్డు కార్డు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. వెల్ఫేర్ బోర్డు కార్డు ఇవ్వడం తంబు విధానాన్ని తీసుకవాచ్చరు దానివలన కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్ర విధానాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో అనేకమంది కార్మికులు వెల్ఫేర్ బోర్డు కార్డులు తీసుకున్నారు కానీ రెన్యువల్ చేసుకునే పనిలో వెనుకబడి ఉన్నారు. వెల్ఫేర్ బోర్డు కార్డును రెన్యువల్ చేసుకోవడం కోసం ఆఫీసుకు వెళ్తే చేయించడం లేదు చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి.ఈ తంబు విధానాన్నిరాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండి వచ్చే సంక్షేమ నిధులను కార్మికులకు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.