సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సివిల్స్ అభ్యర్థులు
మరణాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థుల విజ్ఞప్తి
మాకు సురక్షితమైన వాతావరణం అవసరం.
వరదల కారణంగా దిల్లీ కోచింగ్ సెంటర్ లో ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతి సంచలనంగా మారింది. అధికారులు, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందంటూ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే వారి మరణాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సివిల్స్ విద్యార్థి ఒకరు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ కు లేఖ రాశాడు. సివిల్స్ విద్యార్థి అవినాశ్ దూబే ఓల్డ్ రాజేంద్రనగర్లోని ఐఏఎస్ స్టడీ సెంటర్ లో ఉన్న లోపాలను లేఖలో వివరించాడు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ విద్యనభ్యసించడమనేది మా ప్రాథమిక హక్కు. నీటి ఎద్దడి, వరదల కారణంగా విద్యార్థుల భద్రతకు ముప్పు. వాటిల్లుతోంది. మాకు సురక్షితమైన వాతావరణం అవసరం. అప్పుడే నిర్భయంగా చదువుపై దృష్టి సారించగలంమన్నరు.దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వర్షాలు పడినప్పుడల్లా నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నాడు