హైదరాబాద్ : రుణమాఫీ పొందని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy ఒక మంచి వార్త చెప్పారు. రుణమాఫీ జరగని రైతులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రుణమాఫీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కౌంటర్లు ఉంటాయని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు.
రుణమాఫీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ ( Runa mafi )చేస్తామని CM Revanth Reddy స్పష్టం చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ లో జరిగిన వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం, ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రైతులు కలెక్టరేట్‌లలో ఫిర్యాదు చేస్తే, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని CM Revanth Reddy తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ అందని రైతులు తమ సమస్యలను ఈ కౌంటర్లలో పరిష్కరించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
స్వాతంత్ర్యం ఎలా సాధించామో గుర్తు చేస్తూ, మహనీయుల త్యాగాలు మనకు ఈ స్వేచ్ఛను ఇచ్చాయని ఆయన అన్నారు. దేశం అభివృద్ధి దిశగా కాంగ్రెస్ చేసిన సేవలు కీలకమని, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ వంటి నాయకులు వ్యవసాయంలో కొత్త విప్లవాలు తెచ్చారని సీఎం కొనియాడారు.
రెండో విడత రుణమాఫీ ఇప్పటికే పూర్తయిందని, మూడో విడతను కూడా పూర్తి చేస్తామని CM Revanth Reddy చెప్పారు. సైనిక అమరవీరులకు నివాళులు అర్పించి, సైనికుల త్యాగాలు ఎప్పటికీ గుర్తుండాలని ఆయన వ్యాఖ్యానించారు.
సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, టెక్నాలజీ, పెట్టుబడులు ద్వారా తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని CM Revanth Reddy హామీ ఇచ్చారు.