సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్: వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరూ వాడ వాడల వెలిసే గణేష్ మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతను పటిష్టం చేయాలని పోలీస్ అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.
ఈ ఏడాది వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందజేస్తుందని సీఎం ఇప్పటికే ప్రకటించారు.
సమాజంలో సమరసత, ఐకమత్యం కోసం ఈ ఉత్సవాలు ప్రజలందరికీ శాంతి, ఆనందం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.