కోచింగ్ సెంటర్ జలసమాధి.. రాజధానిలో అక్రమంగా నిర్వహిస్తున్న 13 కోచింగ్ సెంటర్లకు సీజ్
– మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21),
Coaching Centres | ໕໖ (Delhi) (Old Rajinder Nagar) గల ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఓల్డ్ రాజేందర్ నగర్లో అక్రమంగా నిర్వహిస్తున్న సుమారు 13 కోచింగ్ సెంటర్లను గుర్తించారు. సెల్లార్లలో అక్రమంగా నిర్వహిస్తున్న ఆయా కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు (Sealed). ఐఏఎస్ గురుకుల్, చాహల్ అకాడమీ, ఫ్లూటస్ అకాడమీ, సాయి ట్రేడింగ్, ఐఏఎస్ సేతు, టాపర్స్ అకాడమీ, దైనిక్ సంవాద్, సివిల్స్ డైలీ ఐఏఎస్, కెరీర్ పవర్, 99 నోట్స్, విద్యా గురు, గైడెన్స్ ఐఏఎస్, ఐఏఎస్ కోసం ఈజీ సెంటర్లు బేస్మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వాటికి సీజ్ చేసి అందులో చదువుకుంటున్న అభ్యర్థులను ఖాళీచేయాలని సూచించారు. ఈ మేరకు ఆయా కోచింగ్ సెంటర్ల ముందు అధికారులు నోటీసులు అంటించారు.
కాగా, శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు. లైబ్రరీ డోర్కు బయోమెట్రిక్ వ్యవస్థ ఉందని, ఇది లాక్ అయిపోవడం వల్లే వీరు బయటకు రాలేకపోయారని పలువురు విద్యార్థులు చెప్తున్నారు. రావూస్ అకాడమీలోకి నీళ్లు వచ్చే ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరగా పైకి రండి, త్వరగా.. త్వరగా.. ఎవరైనా మిగిలిపోయారా? అక్కడ ఎవరైనా ఉన్నారా; అంటూ వీడియోలో ఆరాతీసూ ఓ వ్యక్తి కనిపించాడు.