పట్టణాలు, పల్లెలు పరిశుభ్రంగా.. పచ్చదనంతో ఉండాలి
ప్రజలు కూడా బాధ్యతగా వర్షకాలంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. కలెక్టర్ రాజర్షి షా
విద్యా శాఖ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి కలెక్టర్, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్
పట్టణాలు, పల్లెలు పరిశుభ్రంగా.. పచ్చదనంతో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేస్తేనే విజయవంతం అవుతాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అదికారులతో కలిసి ప్రారంభించారు. తొలి రోజు వైద్య ఆరోగ్య, మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించి కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ… ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్వచ్ఛదనం పచ్చదనంలో సోమవారం నుంచి ఈ నెల 9వ తేది వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఐదు రోజులే కాకుండా ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛదనం పచ్చదనం నిర్వహించేల ప్రణాళికలు చేసుకోవాలన్నారు. కుక్కల సమస్య ఎక్కువగా ఉందన్నారు. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయన్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ కు ప్రత్యేక వెటర్నరి వైద్యున్ని నియమించేల చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. అదే విదంగా వ్యాదులు ప్రబలుతున్న కాలనీల్లో వార్డు అధికారులు నిత్యం పర్యటిస్తు నీరు నిల్వ లేకుండా చేస్తే రోగాలను ఆరికట్టవచ్చని తెలిపారు. ఆదిశగా ముందు సాగాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నాయన్నారు. వన మహోత్సవంతో రాష్ట్ర ప్రబుత్వం. మా కే నామ్ ఏక్ పేడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రజలు కూడా బాధ్యతగా వర్షకాలంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అవసరాల కోసం 50, 60 సంత్సరాల కాలం నాటి మొక్కలను నరికివేస్తున్నామని. వాటి స్థానంలో కొత్త మొక్కలు పెట్టకపోవడంతో పర్యావరణ సమూతుల్యత దెబ్బతింటుందన్నారు. మొక్కలు నాటిన.
మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతు …. ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. యానిమల్ కేర్ సెంటర్లో ఉచితంగా బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు. కానీ దీనికి మున్సిపల్పై భారం పడుతుందన్నారు. అదే విధంగా పట్టణ ప్రగతి నిధులు రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. పట్టణంలోని ఆయా కాలనీల్లో గ్రావెల్ వేయడానికి పది లక్షల రూపాయలను మంజూరు చేయాలని కలెక్టర్ను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ అభిగ్యాన్ మాలవీయ, మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్, డీఎంహెచ్ డాక్టర్ నరేందర్, డీవైఎస్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, కౌన్సిలర్లు పవన్ నాయక్. ఆకుల ప్రవీణ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.