అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నెరవేర్చడంలో విఫలమైందని బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుభాష్ అన్నారు. ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ సోమవారం ఆదిలాబాద్ రూరల్ తాసిల్దార్ కార్యాలయంలో అధికారులకు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ పేరుతో డిక్లరేషన్ పేర్లతో ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను మాట తప్పిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు తీవ్రంగా అన్యాయం చేసిందని అన్నారు. వెంటనే దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు