ఆటో వద్దకే వచ్చి సాక్షాలను విచారించిన న్యాయమూర్తి
-ఉమ్మడి ఆదిలాబాద్ చరిత్రలో మొదటి సారి
సాక్షాలను నమోదు చేయడంలో విభిన్న పద్ధతులను ఉపయోగిస్తారు… కానీ అదిలాబాద్ చరిత్రలో మొదటి సారిగా జిల్లా పిసిఆర్ కోర్టు న్యాయమూర్తి టి దుర్గారాణి సాక్షాలను ఆటో వద్దకే వచ్చి సాక్షాన్ని నమోదు చేశారు. ఈ మేరకు కోర్టు లైజన్ అధికారి ఎం. గంగా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. తాంసి మండలంలోని జామిడి గ్రామానికి చెందిన మునేశ్వర్ రాంబాయి, భగత్ సులోచనలు 2017 సంవత్సరంలో తలమడుగు పోలీస్ స్టేషన్లో కే. ఉషన్న, అయిండ్ల సక్కుబాయిలపై ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా బుధవారం ఇద్దరి బాధితుల సాక్ష్యం నమోదు చేయవలసి ఉండెను కానీ వారు ఇరువురు నడవలేని స్థితిలో అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారిని తలమడుగు పోలీస్ స్టేషన్ సిడిఓ సంతోష్ కానిస్టేబుల్ సహాయంతో కోర్టు ఆవరణంలోకి తీసుకువచ్చారు. మునేశ్వర్ రాంబాయి, భగత్ సులోచన పరిస్థితి పరిశీలించిన న్యాయమూర్తి బాధితులు ఉన్న ఆటో వద్దకు స్వయంగా వెళ్లి ఏపీపీ ఎం. నవీన్, న్యాయవాది ఏ అమరేందర్ రెడ్డిల సమక్షంలో సాక్ష్యము నమోదు చేశారు.