పొట్టి ప్రపంచ కప్ వైఫల్యం తర్వాత గాడిలో పడాలనుకున్న శ్రీలంక(Srilanka)కు భారత జట్టు భారీ షాకిస్తూ టీ20 సిరీస్ తన్నుకుపోయింది. సొంతగడ్డపై పొట్టి సిరీస్ పోవడంతో వన్డే సిరీస్ అయినా గెలవాలనే కసితో లంక ఉంది. అందుకని టీమిండియాతో వన్డే సిరీస్ అయినా గెలవాలనే కసితో లంక ఉంది. అందుకని టీమిండియాతో వన్డే సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బలమైన స్క్వాడ్ను ప్రకటించింది. మూడో టీ20 సమయంలోనే లంక సెలెక్టర్లు 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. రెగ్యులర్ కెప్టెన్ కుశాల్ మెండిస్ స్థానంలో చరిత్ర అసలంక పగ్గాలు అప్పగించారు. ఈమధ్య టెస్టు సిరీస్ లో అదరగొట్టిన 24 ఏండ్ల 25 నిషన్ మదుష్క బ్యాకప్ ఓపెనర్గా సెలెక్ట్ అయ్యాడు. సీనియర్ పేసర్ చమిక కరుణరత్నే, లంక ప్రీబమియర్ లీగ్లో మెరిసిన పేసర్ అసిత్ ఫెర్నాండోకు సైతం సెలెక్టర్లు అవకాశమిచ్చారు. భారత,శ్రీలంకల మధ్య ఆగస్టు 2న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో వన్డే సిరీస్ మొదలవ్వనుంది..