నాటిక ప్రదర్శన ద్వారా తల్లిపాలపై అవగాహన

అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేయష్కరమని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. సోమవారం రిమ్స్ లోని కంగరు మధర్స్ కేర్ యూనిట్ లో తల్లిపాల ప్రముఖ్యతపై మేడికోలు నాటిక ప్రదర్శన ద్వారా వివరించారు. తల్లులు పుట్టిన బిడ్డకు ముర్రిపాలు పట్టించాలనే అంశంతో చేసిన నాటకం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ… బిడ్డకు తల్లిపాటు ఎంతో శ్రేయష్కరమని అన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న మహిళలు బిడ్డలకు పాలివ్వడానికి సుముకంగా ఉండడం లేదన్నారు. బిడ్డకు పాలిస్తే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటారన్నారు. బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. దీనిపై తల్లులకు అవగాహన కల్పించేల మేడికోలు చేసిన నాటకం బాగుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ సి యూ నోడల్ అధికారి డాక్టర్. అనంతరావ్, పిడియాట్రిక్ వార్డు హెచ్ ఒడి డాక్టర్ హేమలత, వైద్యులు తిరుమల్ రెడ్డి, సినియర్ నర్సింగ్ ఆఫీసర్ టీ .విమలమ్మ, ఎస్ .ఎలిజబెత్ రాణి తదితరులు పాల్గొన్నారు.

 

విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనంలో వైద్య శిబిరం

పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనంలో ఆయూష్ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ ఫరీద బేగం, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రితమ్ రాథోడ్ లు వయోవృద్ధులను పరీక్షించి మందులను ఉచితంగా అందించారు.
వయోవృద్ధులు దీర్ఘకాలిక వ్యాదులైన బీపీ, షుగర్, మధుమేహం లాంటితో బాదపడుతుంటారని మెడికల్ ఆఫిసర్ ఫరీద బేగం అన్నారు. ఆయూష్ తరపున వైద్య శిబిరం నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పూర్తిగా హెల్బర్తో ఉంటాయని, ఈ మందుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో ఆయూష్ సిబ్బంది దారతి, నవీన్ కుమార్, వయోవృద్ధులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *