క్రీడలు మానసికోల్లాసాని ఇస్తాయి
జిల్లా కోర్టు District Court ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు
క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక ధృడత్వానికి ఎంతగానో దోహదపడతాయని ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించినా క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. నిత్యం విధుల్లో బిజీగా గడిపే న్యాయవాదులు, ఉద్యోగులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావుతో పాటు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సరదాగా బ్యాటింగ్ చేసి అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. . ఈ సందర్భంగా మాట్లాడుతు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు…స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపడుతున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలనీ అన్నారు. క్రీడోత్సవాలు నిర్వహిస్తున్న బార్ అసోసియేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్‌తోపాటు పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు