ఐదో అంతస్తు నుంచి పడిన కుక్క.. నడుస్తున్న బాలికపై పడటంతో ఆ చిన్నారి మృతి

ముంబై: పెంపుడు కుక్క బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కింద పడింది. అయితే కింద ఉన్న రోడ్పై తల్లితో కలిసి నడుస్తున్న మూడేళ్ల బాలికపై ఆ కుక్క పడింది. స్పృహ తప్పిన ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. (Dog Falls From 5th Floor Killing Girl) దీంతో ఆ బాలిక కుటుంబంలో విషాదంనెలకొన్నది. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ముంబ్రాలోని అమృత్నగర్లో చిరాగ్ మాన్షన్ 5వ అంతస్తు పైనుంచి పెంపుడు కుక్క Dog కింద పడింది. బంధువులు, తల్లితో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తున్న మూడేళ్ల బాలికపై ఆ కుక్క పడింది. ఆ ధాటికి రోడ్డుపై పడిన ఆ చిన్నారి స్పృహ కోల్పోయింది.

కాగా, ఆందోళన చెందిన తల్లి ఆ బాలికను ఎత్తుకుని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షల కోసం మరో ఆసుపత్రికి తరలించగా ఆ చిన్నారి మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుక్క ప్రమాదవశాత్తు బిల్డింగ్పై నుంచి పడిందా? జంప్ చేసిందా? లేక ఆ కుక్కను ఎవరైనా కిందకు తోసేశారా? అన్నది ఆరా తీస్తున్నారు.మరోవైపు బిల్డింగ్ పైనుంచి బాలికపై పడి ఆ చిన్నారి మరణానికి కారణమైన పెంపుడు కుక్క తీవ్రంగా గాయపడింది. అనంతరం పైకి లేచిన అది బాధతో కుంటుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *