కుక్కకాటుతో ఒక్క ఏడాదిలో 286 మరణాలు
46,54,98 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్లు
కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్
దేశవ్యాప్తంగా ఒక్క 2023 సంవత్సరంలోనే కుక్కకాటుతో 286 మంది మృతి చెందారని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పార్లమెంటులో వెల్లడించారు . ఆ ఒక్క ఏడాదిలో మొత్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి లోక్ సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. అదే ఏడాది 46,54,98 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రేబిస్ నియంత్రణకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కుక్క కాటు కేసుల నియంత్రణకు శునకాల సంఖ్య పెరగకుండా.. స్థానిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అదేవిధంగా జంతు వ్యాధుల నియంత్రణకు కేంద్రం నిధులు సమకూరుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రేబిస్ టీకాకు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు.