విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్.రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా
విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్కరించిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్.రెడ్డి అన్నారు. అదిలాబాద్ జిల్లా జెడ్పి సమావేశ మందిరంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువందనం పేరిట ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గోడం నగేష్, విశిష్ట అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్.రెడ్డి, ఆత్మీయ అతిథులుగా డీఈవో టి.ప్రణీత, తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె. హన్మంర్రావు, యన్.సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని అందుకు ఇటీవల బడ్జెటులో ఆ రంగానికి కేటాయించిన నిధులే నిదర్శనమని ఉదహరించారు. జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏ సంఘం చేయని విధంగా తపస్ గురువులను సన్మానించడం అభినందనీయమన్నారు. తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునీల్ చౌహన్, గోపి కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.