ర్యాగింగ్ చట్ట రిత్యా నేరం – జిల్లా ఎస్పీ గౌష్ ఆలం GAUSH ALAM, I.P.S , SP Adilabad
ప్రతి కళాశాల పాఠశాల నందు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు
- విద్యాసంస్థల నందు ర్యాగింగ్ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు .జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలలో పాఠశాలల నందు యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
కళాశాల నందు, పాఠశాల నందు నూతనంగా వచ్చిన వారిపై ర్యాగింగ్ కు పాల్పడడం జరగడం చట్టరీత్యా నేరమని ఎటువంటి హాని చేయదలచుకున్న వారిపై ర్యాగింగ్ కు సంబంధించిన కేసులు నమోదు చేయబడతాయని తెలియజేశారు. - విద్యార్థుల భవిష్యత్తు కేసులు నమోదు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలకు కష్టతరం కావున ఇలాంటి ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని తెలియజేశారు. యజమానులు విద్యాసంస్థల్లో విద్యార్థులకు రాగింగ్ పై అవగాహనను, వాటి వల్ల కలుగు పరిణామాలపై చైతన్య పరచాలని తెలిపారు. ఎటువంటి అత్యవసర సమయంలోనైనా డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయవలెనని తక్షణం పోలీసు సిబ్బంది తమ వద్ద ఉంటుందని తెలియజేశారు. రాగింగ్ పై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు తరపున అన్ని విద్యాసంస్థల నందు చైతన్యపరిచే కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయని తెలియజేశారు.