ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో కస్టమ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎ) కలిసి దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 847 కిలోల బంగారాన్ని జప్తు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

గత ఏప్రిల్ నుంచి జూన్ వరకూ 1282 కేసుల్లో 847.43 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.543.61 కోట్లు ఉందని చెప్పారు. మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ 2021-22 నుంచి 2024-25 వరకూ దేశంలోని వివిధ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల వద్ద కస్టమ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్న ‘స్మగ్లింగ్ బంగారం’ వివరాలను వెల్లడించారు.

గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 3714 కిలోల బంగారం (రూ.2081 కోట్లు) జప్తు చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 5962 కేసులు నమోదయ్యాయన్నారు. 2022-23లో రూ.1382 కోట్ల విలువైన 2,776 కిలోల బంగారం, 2021-22లో రూ.572 కోట్ల విలువ గల 1240 కిలోల బంగారం జప్తు చేసినట్లు వెల్లడించారు. నౌకాశ్రయాల వద్ద గత ఆర్థిక సంవత్సరంలో 1.28 కిలోల బంగారం (రూ.066 కోట్లు) జప్తు చేశామన్నారు. గత త్రైమాసికంలో 132 కేసుల్లో 152 మంది నిందితులను ప్రాసిక్యూట్ చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2023-24లో 174 కేసుల్లో 280 మందిని ప్రాసిక్యూట్ చేసినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *