దిగిన బంగారం.. ధర
తులం వెయ్యి రూపాయలదాకా
పసిడితోపాటు వెండి ఏకంగా రూ.4,500 తగ్గింది
ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.950 తగ్గి రూ.71,050కి తగ్గింది.
బంగారం ధరలు రోజు రోజు దిగుతున్నాయి . తాజాగా దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ పడిపోవడంతో తులం ధర మరో వెయ్యి రూపాయల వరకు దిగొచ్చింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.950 తగ్గి రూ.71,050కి తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం పుత్తడి ధర శనివారం రూ.72 వేలస్థాయిలో ఉన్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. పసిడితోపాటు వెండి ఏకంగా రూ.4,500 తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.84,500కి దిగింది. ధర తగ్గకముందు ఇది రూ.89 వేల స్థాయిలో ఉన్నది. ప్రస్తుత సంవత్సరంలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన నాటినుంచి ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు దిగువముఖంగానే పయనిస్తున్నాయి. అయినప్పటికీ అంతర్జా తీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 10.60 డాలర్లు పెరిగి 2,438.50 డాలర్లకు చేరు కోగా, వెండి 28.28 డాలర్ల వద్ద ఉన్నది.