ప్రభుత్వ నిర్లక్ష్యo తోనే విద్యార్థులు మృతి
లోక్ సభలో బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్
పూర్తిస్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యత వహించాలి
ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై చర్చకు లోక్ భలో చర్చ
ఢిల్లీ లోని ఓల్డ్ రాజేందర్ నగర్ లో గల ఓ కోచింగ్ సెంటర్లోకి శనివారం రాత్రి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో కోచింగ్ సెంటర్ ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశం పార్లమెంట్ ఉభయసభలకు చేరింది. ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు (UPSC Apirants) మృతిచెందిన ఘటనపై చర్చకు లోక్సభలో విపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. సభ ప్రారంభమైన తర్వాత యూపీఎస్సీ అభ్యర్థుల మృతిపై సభలో చర్చ జరపాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి స్పీకర్ ఓం బిర్లా అనుమతివ్వడంతో సభ్యులు దీనిపై చర్చ ప్రారంభించారు. ఈ చర్చ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీలు విరుచుకుపడ్డారు. రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ఆరోపించారు.
ఈ మేరకు లోక్సభలో బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ మాట్లాడారు ….ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ దశాబ్దం పాటు అధికారంలో ఉంది. ఆప్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోలేదు సరికదా.. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగానే ఇవాళ యూపీఎస్సీ విద్యార్థులు మరణించారు’ అని బన్సూరీ స్వరాజ్