ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడ కాలనీకి చెందిన హరిదాస్ విద్యాసాగర్, సురిత దంపతుల కుమారుడు శివప్రసాద్ మొదటి ప్రయత్నంలోనే ఏఈఈ పోస్టుకు ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి మిషన్ భగీర డిపార్ట్మెంట్ లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయనకు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.