Jogu Ramanna
గత బి ఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు అందించడం తో ఆ సత్ఫలితాలను నేడు విద్యార్థులు అందుకోగలుగుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గోస్కుల విజయ ఉద్యోగ ఫలితాల్లో సత్తా చాటి మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో aee ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల మాజీ మంత్రి జోగు రామన్న గారు హర్షం వ్యక్తం చేశారు . ఆదివారం తిలక్ నగర్ లో గల వారి నివాసనికి మాజీ మంత్రి జోగు రామన్న గారు చేరుకొని, విద్యార్థిని విజయ తో పాటు వారి తల్లిదండ్రులు రవీందర్ సంగీతల ను శాలువాతో ఘనంగా సత్కరించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. జోగు రామన్న గారు మాట్లాడుతూ గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో 2022 23లో వచ్చిన నోటిఫికేషన్ లో ఉద్యోగం సంపాదించడం జరిగిందని జోగు రామన్న అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అరువైన విద్యను అందిస్తూ ఉద్యోగాల నోటిఫికేషన్ అందించడం ద్వారా నేడు విద్యార్థుల ఆ సత్ఫలితాలను ఇప్పుడు అందుకోవడం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే విద్య ఫై ప్రతి ఒక్కరు పట్టు సాధించినట్లయితే ఇలాంటి మరెన్నో విజయాలను అందిపుచ్చుకోవాలి జోగు రామన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రలాద్. వార్డ్ సభ్యులు కొండ గణేష్. నల్ల మహేందర్. కౌన్సిలర్ గెడం సంజయ్, పందిరి భూమన్న కోవ రవి. కాలనీవాసులు పాల్గొన్నారు..