సిద్ధాంతాలనే అస్త్రంగా మలిచి పోరాడిన యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ -కంది శ్రీనివాస రెడ్డి
ఆయన ఆశయాలకనుగుణంగా నడుచుకోవాలని పిలుపు
ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కంది శ్రీనివాస రెడ్డి ఘన నివాళ్లు
ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోసం ఆస్తి పాస్తులతో పాటు తన జీవితాన్ని కూడా త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయ శంకర్ సర్ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి కొనియాడారు.మంగళవారం ఆయన 90వ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రొఫెసర్ జయ శంకర్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. అజన్మ బ్రహ్మ చారిగా తన పూర్తి సమయాన్ని, ధనాన్ని,జీవితాన్ని తెలంగాణా సాధన కోసమే త్యాగం చేసిన ధన్య జీవి అని స్మరించుకున్నారు. మలిదశ తెలంగాణా ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన మేధావి జయశంకర్ సర్ అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ఒక సిద్ధాంత పరమైన ఉద్యమ కార్యాచరణకు ఊపిరిలూదిన గొప్ప మనిషి అని కొనియాడారు. తెలంగాణా సాధన కోసం తను నన సిద్ధాంతాలనే ఒక అస్త్రంగా చేసి తెలంగాణా సాధించేందుకు వ్యూహ రచన చేసిన ఓ గొప్ప సిద్ధాంత కర్త అని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆంధ్రాపాలకుల కుట్రలు బయట పెట్టి మా నీళ్లు ,నిధులు , నియామకాలు మాకే కావాలని గొప్ప పోరాటం చేసిన యోధులు జయ శంకర్ సర్ అన్నారు.ఆయన తెలంగాణా అమర జీవి అని ఆ మహనీయుని త్యాగాల ఫలితమే తెలంగాణ అన్నారు.ఆయన తెలంగాణా ప్రజల గుండెల్లో చిరస్మణీయంగా నిలిచి పోతారన్నారు. జయ శంకర్ సర్ ఆశయాల కనుగుణంగా తెలంగాణా ప్రజలు ముఖ్యంగా యువత నడుచుకోవాలని కంది శ్రీనివాస రెడ్డి పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి , సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, బండి దేవిదాస్ చారి, పోరెడ్డి కిషన్,ఆవుల వెంకన్న, నాగర్కర్ శంకర్,సింగిరెడ్డి రాంరెడ్డి,రూపేష్ రెడ్డి, రావుల సోమన్న రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.