బర్త్ డే పురస్కరించుకొని సేవాకార్యక్రమాలు
పాఠశాల విద్యార్ధులకు స్కూల్ బ్యాగులు, ప్లేట్స్ పంపిణీ
ఆదిలాబాద్ పట్టణంలో అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి.పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు ,అభిమానులు మిత్రులు ,శ్రేయోభిలాషుల మధ్య కంది శ్రీనివాస రెడ్డి తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు.అనునిత్యం సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిన ఆయన తన ప్రతీ పుట్టిన రోజును మరిన్ని సేవా కార్యక్రమాలతో చిరకాలం గుర్తుండి పోయేలా జరుపుకుంటారు.
ముందుగా ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈశిబిరంలో 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
అనంతరం పట్టణంలోని న్యూహౌజింగ్ బోర్డ్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేద విద్యార్దులకు తన సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డితో కలసి స్యూల్ బ్యాగులు అందించారు.
అనంతరం రణదివే నగర్ లోని పాఠశాల విద్యార్దులకు ప్లేట్స్ పంపిణీ చేసారు. తమ కోసం తమ పాఠశాల కొచ్చి తమ అవసరాలు తీర్చిన కంది శ్రీనిఆస రెడ్డి దంపతులకు విద్యార్ధులతో పాటు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టి బాగా చదువుకోవాలని మంచి ప్రయోజకులై తల్లి దండ్రులతో పాటు చదువు నేర్పిన గురువులకు పుట్టి పెరిగిన ప్రాంతానికి మంచి పేరు తీసుకు రావాలని కంది శ్రీనివాస రెడ్డి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్ ,కలాల శ్రీనివాస్, చంద నర్సింగ్ ,ఇమ్రాన్ , డేరా కృష్ణారెడ్డి ,ఎంఏ షకీల్ ,మహాకాల్ అజయ్,ఎల్చార్వార్ సురేందర్, ఇంతియాజ్ , అన్నపూర్ణ ,అశోక్, విఠల్ , మానే శంకర్ తదితరులు పాల్గొన్నారు