డాక్టర్ పై జరిగిన ఘోర సంఘటనపై మున్నూరుకాపు సంఘం నిరసన
మహిళా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన
న్యాయం కోరుతూ, కఠిన చర్యలు డిమాండ్ చేసిన సంఘం నేతలు
కలకత్తా RG కార్ హాస్పిటల్ లో జరిగిన దారుణ సంఘటన – డాక్టర్ పై అత్యాచారం, ఆపై హత్య – అందరి హృదయాలను కలచివేసింది. ఈ ఘోరానికి నిరసనగా తాలూకా మున్నూరుకాపు సంఘం మరియు తాలూకా మహిళా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
జోగు శైలజ, పసుల రమ, వడ్డరపు లలిత, ముత్యాల మంజుల, ఆరే నవనీత, దేశెట్టి సౌజన్య, బండారి అనూష, రౌతు శ్రీలత, కీర్తి సుజాత, బండారి సుధ, కలాల కావ్య, మెంగవార్ ప్రేమల తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.