కోల్ కత్తాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన నిరసిస్తూ సోమవారం సాయంత్రం ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తులతో నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెడికల్ కాలేజ్ నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ చౌరస్తా వరకు సాగింది. వైద్యురాలిపై హత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు సందీప్ చారి డిమాండ్ చేశారు.