మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో ప్రకటన
మీరు కొత్తగ చేయడానికి ఏం లేదు
మూసీలో మేము 3,866 కోట్లతో వంద శాతం సివరేజ్ ట్రీట్మెంట్ చేశాం.. కేటీఆర్
సివరేజ్ ట్రీట్మెంట్ పూర్తైన తర్వాత మా ప్రభుత్వం ఉన్నపుడు 16 వేల కోట్ల అంచనాతో మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేశాం .ఇవాళ మాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతుంది అంటే.. మూసీ ప్రక్షాళనపై ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తున్నారు.
మూసీ పై ఎక్స్ ప్రెస్ వే మరియు బ్యూటిఫికేషన్ తో కలిపి 16 వేల కోట్లుతో మేము అంచనా వేస్తే.. అది ఎందుకు 50 వేల కోట్లు అయ్యింది.. మళ్లీ అది 70 వేల కోట్లకు ఎలా చేరింది.. ఎందుకు అది మళ్లీ లక్ష 50 వేల కోట్లు అయ్యింది . ఇది ప్రజల సొమ్ము మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి