న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ డిమాండ్ చేశారు. జనాగమలో పోలీసులు న్యాయవాదులు (Lawyers) అమృత రావు, కవితలపై దాడి చేయడాన్ని నిరసిస్తూ బుదవారం జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. రక్షణ చట్టాన్ని తీసుకువరావాలని నినాదాలు చేశారు.


ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ మాట్లాడుతూ… కేసు విషయంలో జనగామ పోలీసు స్టేషన్కు వెళ్లిన న్యాయవాదులపై అక్కడి పోలీసులు దురుసుగా వ్యవహరించి దాడి చేశారన్నారు. రక్షబటులే భక్షకులుగా న్యాయాన్ని కాపాడే లాయర్లపై దాడులకు పాల్పడడం సరికాదన్నారు. పోలీసులు వైఖరి మార్చుకోకపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అదే విధంగా న్యాయవాదులకు రక్షణ కల్పించేల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తీసుకోని రావాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు చట్టాలను తీసుకురావాలని బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ డిమాండ్ చేశారు. జనాగమలో పోలీసులు న్యాయవాదులు అమృత రావ్, కవితలపై దాడి చేయడాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంబడి సంతోష్, క్రీడాల కార్యదర్శి ముజహింద్, చందు సింగ్, డీఎస్పీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, నిఖిలేష్ తొగరి, ఎండీ గౌస్, రవీందర్, మల్లిఖర్జున్, చంద్రకాంత్ చౌదరి , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *