Health tips : పాలు ఆరోగ్యానికి మంచివి..! అయితే ఈ మాట ఒకప్పటి స్వచ్ఛమైన పాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటి ప్రిజర్వ్ పాలను ఆరోగ్యానికి మంచివి అనలేము. ఎందుకంటే ఈ ప్రిజర్వ్ పాలతో కొత్తకొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఈ ప్రిజర్వ్డ్ పాలే ఆరోగ్యానికి మంచివి కాదంటే.. ఈ పాలలో రుచి, తీయదనం కోసం కొందరు వాటికి చక్కెర, బెల్లం, తేనె లాంటివి కలిపి తీసుకుంటుంటారు. వివిధ రకాల పొడులు కలుపుతారు. అయితే పాలల్లో ఇలాంటివి కలుపుకోవడంవల్ల ఆరోగ్యానికి మరింత ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి పాలలో కలుపగూడని ఆ పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం..
చక్కెర
పాలు తాగే వాళ్లలో చాలామంది అందులో చక్కెర కలుపుకుంటారు. పిల్లలకు కూడా పాలల్లో పంచదార కలిపి తాగిస్తారు.
కానీ ఇది ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలల్లో పంచదార కలిపితే కేలరీలు మరింత పెరుతాయట. దాంతో ఆ పాలు తాగితే బరువు పెరుగుతారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే పంచదార కలిపి పాలు తాగుతారు. పాలు, పంచదార కలయిక జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతుందట. ఎసిడిటీ, మల బద్ధకం, డయేరియా, పైల్స్ లాంటి సమస్యలు వస్తాయట.
చాక్లెట్ సిరప్
పాల రుచిని పెంచడానికి కొందరు చాక్లెట్ సిరప్ కలుపుకుంటారు.
అయితే పాలల్లో చాక్లెట్ సిరప్ కలిపి తాగడం వల్ల శరీరంలో రిఫైన్ చేయని కొవ్వులు పెరుగుతాయి. ఇది కూడా బరువు పెరగడానికి, రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడానికి కారణమవుతుంది. పలురకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
కెఫిన్
చాలామంది పాలతో టీ లేదా కాఫీ పౌడర్ కలిపి తాగుతారు.
అది కూడా ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కెఫిన్ పాలలో కలిపితే పాలలో పోషకాలను శరీరానికి అందకుండా చేస్తుంది. కెఫిన్ కారణంగా నిద్ర లేమి, హార్ట్ బీట్ పెరగడం, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
కృత్రిమ స్వీటెనర్స్
ఇక పాలలో తీపి పెరగడానికి కొందరు కృత్రిమ స్వీటెనర్లు వాడతారు. కానీ ఇవి చక్కెరకన్నా ప్రమాదకరమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కృత్రిమ స్వీటెనర్స్ కలపడం వల్ల వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. కొవ్వులు పెరుగుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.