ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిన్రెడ్డి, వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్లపై అనర్హత వేటువేయాలని పిటిషన్లు కోరారు. అనర్హత వేటువేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరఫున గండ్ర మోహనరావు వాదనలు వినిపించారు. స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను గండ్ర ప్రస్తావించారు. కోర్టు విచారణను ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది.. కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. దాంతో ముగ్గురు ఎమ్మెల్యేలపై అర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరారు. అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు.